చింతపండు అవసరం లేని ఘాటైన ఉసిరికాయ చారు శీతకాలంలో రోజూ తినదగిన తినాల్సిన రెసిపీ. మిరియాల ఘాటు ఉసిరికాయ వగరు పులుపుతో చింతపండు వేసి చేసే చారుకి ధీటుగా ఉంటుంది.

శీతాకాలంలో తరచూ ఈ చారు తినడం వల్ల జలుబు దరిచేరదు, చక్కగా తిన్న ఆహారం జీర్ణమవుతుంది. దక్షిణాది వారికి భోజనంలో చారు తప్పక ఉండాల్సిందే, అందుకే తెలుగు ఎన్ని రకాల చారులో దక్షిణ భారత దేశం వారికి. చారులన్నీ ఒకే తీరులో ఉంటాయి అని అనుకోలేము, ఇంటికి చేతికి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుంది.

విస్మయ్ ఫుడ్ అంటే చారులకి సాంబార్లకి ఎంతో ప్రేత్యేకం, ఎందుకంటె నాకు చారులంటే అంటే అంత ఇష్టం కనుక. నేను ఇది వరకు ఎన్నో రకాల చారులు చేశాను చుడండి.

మీరు రెసిపీని కూడా ఇష్టపడవచ్చు పుదీనా చారు

టిప్స్

మిరియాలు:

  1. ఈ చారులో కారం అంతా మిరియాల ఘాటే, అందుకే శీతాకాలం లో తరచూ తింటుంటే గొంతులోని పడిశం, కఫం తగ్గిపోతుంది.

మిరపకాయాలు:

  1. ఈ చారులో నేను ఒక్కటే మిరపకాయ, ఒక్కటే ఎండు మిర్చి వేశాను, అది కూడా అలవాటు తాలింపు కారణంగా. ఆ మిర్చీ కూడా వేసినా వేయకపోయినా పర్లేదు.

టమాటో:

  1. ఈ చారుకి కచ్చితంగా బాగా పండిన దేశవాళీ ఎర్రని టమాటో పండుని మాత్రమే వాడుకోవాలి. దేశవాళీ టమాటో అయితేనే చింతపండు వేయకున్నా చారుకి పులుపు సరిపోతుంది.

చారు మరిగించి తీరు:

  1. ఎప్పుడూ కూడా చారులు మరగకూడదు. సాంబార్లు బాగా మరగాలి. ఇది గొప్ప రుచిగల సాంబార్, చారుల రుచికి ఒక సీక్రెట్.

  2. చారులో నీళ్లు పోశాక మీడియం ఫ్లేమ్ మీద చారు మధ్యలో పొంగు రాగానే చారు తయారయ్యింది అని గుర్తు.

పప్పు:

  1. నేను 3 tbsp కందిపప్పుని మెత్తగా ఎనిపి చారులో వేశాను. పప్పు చారు మరీ పలుచగా లేకుండా అన్నంలో కలుపుకుతినేందుకు వీలుగా ఇంకా నోటికి అందుతుంది.

  2. పప్పు వేయాలని ఏమి లేదు, పప్పు వేస్తే ఒక రుచి వేయకపోతే మరో రుచి. వేయకపోయినా చారు రుచిగా ఉంటుంది.

అన్నంతోనే కాదు ఉసిరిచారు ఇలా కూడా తీసుకోవచ్చు:

  1. ఈ ఉసిరికాయ చారు అన్నంతోనే కాదు, వేడి వేడి ఇడ్లీ మీద సాంబారుకి బదులు పోసుకుని కూడా తినొచ్చు.

  2. ఇంకా జ్వరమొచ్చినప్పుడు లేదా నోటికి రుచి తెలియనప్పుడు సూప్ గా తీసుకున్న చాలా మేలు చేస్తుంది.

ఆఖరుగా:

  1. నేను ఈ చారులో వెల్లులి వేయలేదు, మీకు నచ్చితే తాలింపులో వెల్లులి వేసుకోవచ్చు

  2. కొందరు చారులో కొంచెమైనా బెల్లం వేస్తారు, నేను వేయలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు.

  3. నేను తాలింపు నూనెతో పెట్టాను, మీకు నచ్చితే నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. నేతితో పెట్టె తాలింపు పరిమళం చాలా గొప్పగా ఉంటుంది.

ఉసిరికాయ రసం - రెసిపీ వీడియో

Usirikaya Rasam | Amla Rasam | How to make Amla Rasam with tips

Sambar - Rasam Recipes | vegetarian
  • Prep Time 20 mins
  • Cook Time 15 mins
  • Total Time 35 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • పేస్ట్ కోసం:
  • 4 నిమ్మకాయ సైజు ఉసిరికాయలు
  • 2 పండిన టమాటో పండ్లు (మీడియం సైజువి)
  • 1. ½ tsp tbsp జీలకర్ర
  • 1 tbsp మిరియాలు
  • చారు కోసం:
  • 1 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1/2 tbsp జీలకర్ర
  • 2 Pinches ఇంగువ
  • 2 Sprigs కరివేపాకు
  • 1 పచ్చిమిర్చి (చీలికలు)
  • 1 ఎండుమిర్చి
  • 1/2 tbsp అల్లం తురుము
  • 1.250 litre నీళ్లు
  • ఉప్పు
  • 1/2 tbsp పసుపు
  • 1/2 Cup మెత్తగా ఉడికించిన పప్పు
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. ఉసిరికాయల నుండి గింజలు తీసేసి, ఉసిరికాయ ముక్కలతో పాటు చారు పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఎండుమిర్చి, పచ్చిమిర్చి అల్లం వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి.
  3. వేగిన తాలింపులో ఉసిరి టమాటో పేస్ట్, ఉప్పు పసుపు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద పొంగనివ్వాలి.
  4. పొంగిన చారులో మెత్తగా ఉడికించుకున్న పప్పు కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    It tastes good than without garlic. Thanks
  • S
    Sirinidhi Rao
    Superb and fantastic aromatic recipe. My husband enjoyed his meal like anything. Thank you for sharing this healthy recipe :)
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Adbhutamaina Ruchi. Ekabigina annam kadupu nindaa tinesaanu. Mee krushiki johaarlu.